మెంబర్షిప్ పొందండి

వార్తలు

September 30, 2019

5 నుంచి వందే భారత్‌

వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ తొలిసారిగా ఢిల్లీ–కత్రా (జమ్మూకశ్మీర్‌) మధ్య అక్టోబర్‌ 5 నుంచి పరుగులు పెట్టనుంది.

Read More

September 30, 2019

ఐఐటీలోప్రసంగానికి సలహాలు కోరిన మోదీ!

దిల్లీ: ఐఐటీ మద్రాస్‌లో సోమవారం జరగబోయే స్నాతకోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్నారు.

Read More

September 28, 2019

ఢిల్లీ చేరుకున్న మోదీ

భార‌త ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ ఢిల్లీ చేరుకున్నారు. అమెరికా ప‌ర్య‌ట‌న ముగియ‌డంతో ప్ర‌ధాని మోదీ శ‌నివారం సాయంత్రం ఢిల్లీలోని పాలెం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు.

Read More

September 19, 2019

ఇ–సిగరెట్లపై నిషేధం

తొలిసారి పట్టుబడితే రూ. లక్ష వరకు జరిమానా, ఏడాది జైలు శిక్ష

ఆర్డినెన్స్‌కు కేంద్ర కేబినెట్‌ ఆమోదం

Read More

September 9, 2019

త్రికరణశుద్ధిగా పాలన

రోహ్‌తక్‌: దేశప్రజలు ఇచ్చిన అపూర్వ మద్దతు, స్ఫూర్తితో ఎన్‌డీఏ ప్రభుత్వ రెండో దఫా పాలన మొదటి 100 రోజుల్లో 3 ముఖ్యమైన విజయాలను సాధించినట్టు ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు.

Read More

August 28, 2019

రైల్వే ప్రయాణీకులకు గుడ్‌ న్యూస్‌.

శతాబ్ధి, తేజాస్‌, ఇంటర్‌సిటీ వంటి పలు ట్రైన్లలో ఖాళీగా ఉన్న సీట్లకు 25 శాతం వరకూ డిస్కౌంట్‌ ఆఫర్‌ చేయాలని రైల్వేలు నిర్ణయించాయి. ఏసీ చైర్‌ కార్‌, ఎగ్జిక్యూటివ్‌ చైర్‌ కార్‌ సదుపాయం ఉన్న అన్ని రైళ్లలో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు.

Read More

August 28, 2019

జమ్మూ-కశ్మీర్‌కు ప్రత్యేక ప్యాకేజీ!

దిల్లీ: జమ్మూ-కశ్మీర్‌లో అభివృద్ధిని శరవేగంగా పట్టాలెక్కించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా 106కుపైగా కేంద్ర చట్టాల అమలుకు అవసరమైన మౌలిక వసతులను కల్పించేందుకు, వివిధ పథకాల అమలుకు వందల కోట్ల రూపాయల ప్యాకేజీని త్వరలోనే ప్రకటించనుంది. ఈ దిశగా కేంద్రం కసరత్తు చేస్తోంది.

Read More

August 28, 2019

జాగో భారత్‌..భాగో!

తిన్నామా.. పడుకున్నామా.. తెల్లారిందా అనుకుంటే ఎలా? పొద్దున లేస్తూనే కాస్త ఒళ్లు వంచాలి. శరీరానికి చెమట పట్టేలా నడవాలి. చల్లటి గాలి పీల్చాలి. ప్రకృతిని ఆస్వాదించాలి.. అప్పుడే మనకు ఆరోగ్యమైనా, ఆనందమైనా.. ఆ రెండూ ఉంటేనే మనం ఫిట్‌గా ఉంటాం. భారత్‌ ఫిట్‌గా ఉంటుంది.

Read More

August 27, 2019

కశ్మీర్‌ ద్వైపాక్షిక అంశమే

బియరజ్‌/ లండన్‌: కశ్మీర్‌ అంశంలో భారత్‌ దౌత్యపరంగా పెద్ద విజయాన్ని నమోదు చేసింది. ఈ సమస్యపై భారత్‌, పాకిస్థాన్‌ల మధ్య మధ్యవర్తిత్వం చేస్తానంటూ పదేపదే చెబుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను తీరు మార్చుకునేలా ఒప్పించగలిగింది.

Read More

August 27, 2019

రూ.1.76 లక్షల కోట్లు

ముంబయి: ప్రభుత్వానికి రూ.1.76 లక్షల కోట్ల మేర డివిడెండు, అదనపు నిధులను బదిలీ చేయడానికి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) బోర్డు ఆమోద ముద్ర వేసింది. ఓ వైపు ద్రవ్యలోటు పెరగకుండానే మరో వైపు మందగమనం పాలవుతున్న ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు అందించాల్సిన తరుణంలో ప్రభుత్వానికి ఈ నిధులు అందుతున్నాయి.

Read More

July 23, 2019

నిప్పులు చిమ్ముతూ...

సోమవారం నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్‌ కేంద్రం రెండో ప్రయోగ వేదిక నుంచి నిప్పులు చిమ్ముకుంటూ నింగికేగుతున్న జీఎస్‌ఎల్వీ మార్క్‌3–ఎం1 రాకెట్‌

Read More

July 23, 2019

బాహు.. భళా!

అప్పటికి 20 గంటలుగా కొనసాగుతున్న కౌంట్‌డౌన్‌ చివరి పది క్షణాలకు చేరుకుంది.. 10.. 9.. 8.. 7.. 6.. 5.. 4.. 3.. 2.. 1.. 0

Read More

July 23, 2019

నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్‌ఎల్‌వీ- ఎం3

చందమామ రావె.. జాబిల్లి రావే.. అంటూ తరతరాలుగా పిలుస్తున్నా రావడంలేదు కదా మామా.. ఇదిగో మేమే వస్తున్నాం నీ దగ్గరకు అంటూ బయలుదేరింది మిషన్‌ చంద్రయాన్‌ -2.

Read More

July 18, 2019

కుల్‌భూషణ్‌ మరణశిక్ష నిలిపివేత

అంతర్జాతీయ న్యాయస్థానంలో భారత్‌ భారీ విజయాన్ని సాధించింది. నౌకాదళ విశ్రాంత ఉద్యోగి కుల్‌భూషణ్‌కు పాకిస్థాన్‌ సైనిక న్యాయస్థానం విధించిన మరణశిక్ష నిలిచిపోయింది. మరణ దండన విధిస్తూ ఇచ్చిన తీర్పును పునః సమీక్షించాలనీ, అప్పటివరకూ శిక్ష అమలును నిలిపివేయాలని అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) పాకిస్థాన్‌కు విస్పష్టం చేసింది.

Read More

July 16, 2019

ఎన్‌ఐఏకి కోరలు

భారతీయులు లేదా భారత దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా విదేశాల్లో జరిగే ఉగ్రవాద కార్యకలాపాలపైనా విచారణ చేపట్టేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)కి అధికారాలిచ్చేందుకు ఉద్దేశించిన ఓ బిల్లును లోక్‌సభ సోమవారం ఆమోదించింది.

Read More

July 16, 2019

అద్దెగర్భం అంగడి సరకు కాదు

కేవలం భారతీయ దంపతులకు మాత్రమే అద్దెగర్భం విధానం ద్వారా సంతానం పొందేందుకు అనుమతి ఉంటుంది. అంతేకాదు, ఆ దంపతులు చట్టబద్ధంగా వివాహం చేసుకుని కనీసం అయిదేళ్ల కాలం పూర్తయి ఉండాలి.

Read More

July 11, 2019

రైళ్లలో అదనంగా 4 లక్షల బెర్తులు

దిల్లీ: రైలు ప్రయాణికులకు శుభవార్త. వచ్చే అక్టోబరు నుంచి రైళ్లలో ప్రతి రోజు అదనంగా 4 లక్షలకు పైగా బెర్తులు అందుబాటులోకి రానున్నాయి. రైల్వేలు అందిపుచ్చుకోనున్న ఆధునిక సాంకేతికత ద్వారా ఇంధన ఖర్చులను ఆదా చేయటంతో పాటు ప్రయాణికులకు సౌలభ్యాన్ని సమకూర్చుకోవచ్చని సీనియర్‌ అధికారులు తెలిపారు.

Read More

July 11, 2019

జల వివాదాలకు సత్వర పరిష్కారం

నదీ జలాల వివాదాలు ఇకపై త్వరితగతిన పరిష్కారమవనున్నాయి. ఈ వివాదాల పరిష్కారానికి ప్రస్తుతమున్న బహుళ ట్రైబ్యునళ్ల స్థానంలో ఒకే ట్రైబ్యునల్‌ ఏర్పాటుకానుంది. దాని ఏర్పాటుకు వీలు కల్పించే ‘అంతర్రాష్ట్ర జల వివాదాల సవరణ బిల్లు-2019’కు కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది.

Read More

July 4, 2019

అన్నదాతకు మద్దతు

ఈనాడు, దిల్లీ: అన్నదాతకు తీపికబురు. కేంద్ర ప్రభుత్వం 2019-20 ఖరీఫ్‌ సీజన్‌కు కనీస మద్దతు ధరల్ని(ఎంఎస్‌పీ) పెంచింది. వరి ధరను క్వింటాకు రూ.65 పెంచింది. రైతుకు సాగు ఖర్చుపై 50% అదనపు ధర కల్పిస్తామని చెప్పిన మాటను దృష్టిలో ఉంచుకుని తాజాగా కనీస మద్దతు ధరలను నిర్ణయించినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ వెల్లడించారు.

Read More

June 27, 2019

ఇక సుజల భారత్‌

దిల్లీ: దేశవ్యాప్తంగా ఎన్నో ప్రాంతాల్లో ప్రజలకు నీళ్లు దొరకడం లేదు. పలుచోట్ల పరిస్థితి దయనీయంగా మారింది. తమిళనాడు వంటి రాష్ట్రాల్లో కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బిందెడు నీటిని బంగారంలా భావించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. తాగునీటి కొరతతో చెన్నైలో కొన్ని కంపెనీలు ఉద్యోగులను ఇంటినుంచే పనిచేయాలని సూచిస్తున్నాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో స్పష్టమవుతోంది.

Read More

June 27, 2019

ప్రజా విజ్ఞతను అవమానిస్తారా?

వరుసగా రెండో రోజు కూడా పార్లమెంట్లో కాంగ్రె్‌సపై ప్రధాని మోదీ వాగ్బాణాలు సంధించారు. బీజేపీ సాధించిన అఖండ విజయాన్ని తట్టుకోలేక ఓటర్లను అవమానిస్తున్నారంటూ ధ్వజమెత్తారు.

Read More

June 26, 2019

భారత ఆత్మను ఛిద్రం చేశారు

ఈనాడు, దిల్లీ: లోక్‌సభ వేదికగా కాంగ్రెస్‌ పార్టీపైన.. ‘నెహ్రూ-గాంధీ’ కుటుంబంపైన ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిప్పులు చెరిగారు. పదునైన పదజాలం, ఘాటు విమర్శలతో విరుచుకుపడ్డారు.

Read More

June 25, 2019

90 క్షణాల్లో బాలాకోట్‌ ఆపరేషన్‌ పూర్తి.. ఇలా

ఇంటర్నెట్‌డెస్క్‌: బాలాకోట్‌పై భారత వాయుసేన ఎలా దాడి చేసిందో తాజాగా బహిర్గతమైంది. ఈ దాడిలో పాల్గొన్న ఇద్దరు పైలట్లు ఆపరేషన్‌ వివరాలను పరిమితంగా ఓ ఆంగ్ల పత్రికకు వెల్లడించారు.

Read More

June 19, 2019

ప్రభుత్వానికి 100 రోజుల అజెండా

దిల్లీ: రెండోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత తొలి బడ్జెట్‌ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో ఆర్థికశాఖ సహా పలు మంత్రిత్వశాఖలకు చెందిన ఉన్నతాధికారులతో ప్రధాని నరేంద్రమోదీ మేధోమథనం జరిపారు. మోదీ నివాసంలో మంగళవారం నిర్వహించిన ఈ భేటీలో ఆర్థికశాఖలోని అయిదుగురు కార్యదర్శులు, అన్నిశాఖల కార్యదర్శులతో పాటు నీతి ఆయోగ్‌ అధికారులు కూడా పాల్గొన్నారు.

Read More

June 19, 2019

డ్రైవింగ్‌ లైసెన్సుకు కనీస విద్యార్హత తొలగింపు

దిల్లీ: యువతకు ఉపాధికావకాశాలు మెరుగుపరిచే ఉద్దేశంతో కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ డ్రైవింగ్‌ లైసెన్సుపై కొత్త నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు కమర్షియల్‌ రవాణా లైసెన్సు పొందాలంటే కనీసం 8వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఎనిమిదో తరగతి ఉత్తీర్ణులు కాకపోయినా ఇకపై లైసెన్సు పొందవచ్చని తాజాగా ప్రభుత్వం ఓ అధికారిక ప్రకటనలో తెలిపింది.

Read More

June 18, 2019

స్వపక్షం.. విపక్షం కాదు.. నిష్పాక్షికం ముఖ్యం

లోక్‌సభకు ఎన్నికైన సభ్యులు స్వపక్షం, విపక్షం అన్న భావనను వదిలిపెట్టి నిష్పాక్షిక భావనతో పని చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. సోమవారం 17వ లోక్‌సభ వర్షాకాల సమావేశాల ప్రారంభం సందర్భంగా ఆయన పార్లమెంటులోకి వెళ్లబోయే ముందు విలేకర్లతో మాట్లాడారు. దేశ ప్రజలకు సేవ చేయడానికి కొత్త శక్తి, ఉత్సాహం,

Read More

June 14, 2019

ఈఎస్‌ఐ చందా తగ్గింపు

దిల్లీ: ఆరోగ్య బీమా పథకం కోసం ఉద్యోగుల రాజ్య బీమా సంస్థ (ఈఎస్‌ఐసీ)కు చెల్లిస్తున్న చందా మొత్తాన్ని తగ్గిస్తూ గురువారం కేంద్ర కార్మిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం జీతాల్లో 6.5 శాతం చందా కింద చెల్లిస్తుండగా, దాన్ని 4 శాతానికి తగ్గించింది. ఇది జులై ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. ఈ కారణంగా 3.6 కోట్ల మంది ఉద్యోగులు, 12.85 లక్షల మంది యజమానులకు లబ్ధి కలుగుతుంది. దీనివల్ల సంస్థలకు రూ.5,000 కోట్ల మేర ఆదా అవుతుంది.

Read More

June 13, 2019

పోలవరానికి రూ.3,000 కోట్లు

పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.3,000 కోట్లు విడుదల చేయడానికి కేంద్ర జల వనరుల శాఖ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ‘నాబార్డు’ ద్వారా ఈ నిధులను విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపింది. మరో రూ.1,810.04 కోట్ల మంజూరుపై కసరత్తు చేస్తోంది. నిధుల వినియోగానికి సంబంధించిన యుటిలైజేషన్‌ సర్టిఫికెట్లను(యూసీలు) ఎప్పటికప్పుడు పంపిస్తే, ప్రాజెక్టుకు వ్యయం చేసిన మొత్తాన్ని రీయింబర్స్‌ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది.

Read More

June 13, 2019

ఈ సమావేశాల్లోనే తలాక్‌ బిల్లు

దిల్లీ: ముస్లిం సమాజంలో ‘ముమ్మారు తలాక్‌’ సంప్రదాయాన్ని నిషేధిస్తూ రూపొందించిన తాజా బిల్లును కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. వచ్చే పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల్లో దీన్ని ప్రవేశపెట్టనున్నారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన అత్యవసరాదేశం (ఆర్డినెన్స్‌) స్థానంలో ఈ బిల్లును రూపొందించారు. ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారమిక్కడ కేంద్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు అంశాలను మంత్రులు చర్చించారు.

Read More

June 11, 2019

ప్రతి శాఖకూ ఐదేళ్ల ప్రణాళిక

దిల్లీ: ప్రతి మంత్రిత్వ శాఖకు స్పష్టమైన లక్ష్యాలు, నిర్దిష్ట మైలురాళ్లతో ఐదేళ్ల ప్రణాళికను రూపొందించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉన్నతాధికారులకు ఆదేశించారు. ప్రస్తుత స్థితిలో మార్పులు రావాలని, జీవన నాణ్యత పెరగాలని కోరుకుంటున్న ప్రజాతీర్పునకు అనుగుణంగా ప్రణాళికలు ఉండాలన్నారు. సోమవారం కేంద్ర మంత్రిత్వ శాఖల కార్యదర్శులతో ఏర్పాటైన సమావేశంలో ప్రధాని మాట్లాడుతూ..

Read More

June 10, 2019

ఉగ్రవాదం ఉమ్మడి శత్రువు

కొలంబో: ఉగ్రవాదం ఉమ్మడి శత్రువని, దానిని ఎదుర్కొనేందుకు ఐక్య, నిర్దిష్ట కార్యాచరణ అవసరమని భారత్, శ్రీలంక అభిప్రాయపడ్డాయి. ఏప్రిల్‌లో ఈస్టర్‌ పర్వదినాన జరిగిన బాంబు దాడుల విషాదం నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న శ్రీలంకకు సంఘీభావం తెలిపేందుకు భారత ప్రధాని మోదీ ఆదివారం కొలంబో చేరుకున్నారు. మాల్దీవుల్లో రెండు రోజుల పర్యటన ముగించుకుని వచ్చిన మోదీకి అధ్యక్షుడు సిరిసేన ఘన స్వాగతం పలికారు.

Read More

June 10, 2019

ఆంధ్రకు అండాదండ

కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన జగన్‌కు నా అభినందనలు. ప్రజలకిచ్చిన హామీలను ఆయన అమలు చేయాలని ఆకాంక్షిస్తున్నా. ఇప్పటికే జగన్‌తో అనేక విషయాలపై చర్చించాం. కేంద్ర, రాష్ట్రాల సమన్వయంతో అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ప్రజలకు అందిస్తాం. రాష్ట్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. మా మద్దతు సదా ఉంటుంది.

Read More

June 10, 2019

నవభారత నిర్మాణం

‘ఓం నమో వేంకటేశాయా.. వినా వేంకటేశం.. ననాథోననాథ.. సదా వేంకటేశం స్మరామీ స్మరామీ... బాలాజీ పాద పద్మాల సాక్షిగా మళ్లీ నాకు అధికారమిచ్చిన భారతదేశ ప్రజలందరికీ కృతజ్ఞతలు. స్వామికి నా ప్రణామాలు’ అంటూ తెలుగులో ప్రసంగం ప్రారంభించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. భాజపా విజయానికి కష్టపడిన కార్యకర్తల కృషిని ఆధ్యాత్మిక నగరి తిరుపతి వేదికగా కొనియాడారు. ప్రజలకు సేవలందించేందుకు పాంచజన్యం పూరించారు.

Read More

June 7, 2019

ఐదేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా పెరిగిన భారత్‌ పరపతి

దిల్లీ: గత ఐదేళ్లలో ప్రపంచవ్యాప్తంగా మనదేశం స్థాయి, పరపతి పెరిగాయని చాలామంది భారతీయులు గుర్తించారని భారత విదేశీ వ్యవహారాల మంత్రి జయ్‌శంకర్‌ పేర్కొన్నారు. ఎన్డీయే ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి రావడానికి ఇది కూడా కారణమైందన్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత మొట్టమొదటిసారిగా భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ),

Read More

June 6, 2019

రూ.15 లక్షల కోట్లతో జాతీయ రహదారులు

న్యూఢిల్లీ: మోదీ ప్రభుత్వంలో రెండో సారి మంత్రి అయిన నితిన్‌ గడ్కరీ తన మంత్రిత్వ శాఖలైన జాతీయ రహదారులు, సూక్ష్మ, లఘు, మధ్యతరహా పరిశ్రమల(ఎంఎస్‌ఎంఈ)కు సంబం ధించి బృహత్‌ ప్రణాళికలను ప్రకటించారు. రూ.15 లక్షల కోట్లతో జాతీయ రహదారులను అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఖాదీ, ఎంఎస్‌ఎంఈ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా మార్కెట్‌ కల్పించడం ద్వారా స్థూల జాతీయోత్పత్తిని (జీడీపీ)ని పెంచుతామన్నారు.

Read More

June 1, 2019

జూన్‌ 17 నుంచి జులై 26 వరకు పార్లమెంటు సమావేశాలు

రెండో విడత అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాని మోదీ నేతృత్వంలో శుక్రవారం సాయంత్రం తొలిసారి నిర్వహించిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దేశంలో ఉన్న అర్హులైన రైతులందరికీ కిసాన్‌ సమ్మాన్‌ పథకం కింద ఏటా రూ.6,000 సాయం అందించాలని నిర్ణయించారు అలాగే చిన్న, సన్నకారు రైతులకు, జీఎస్‌టీ పరిధిలోకి రాని వ్యాపారులకు పింఛను పథకం అమలు చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది.

Read More

June 1, 2019

జై జవాన్‌.. జై కిసాన్‌

న్యూఢిల్లీ, మే 31 (ఆంధ్రజ్యోతి): రైతుకు పింఛను! చిరు వ్యాపారికి కూడా! రెండోసారి ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మోదీ తన తొలి కేబినెట్‌ సమావేశంలో తీసుకున్న సంచలన నిర్ణయాలు ఇవి! అంతేనా.. పీఎం-కిసాన్‌ పథకాన్ని మరింత విస్తరించారు. దేశవ్యాప్తంగా రైతులందరికీ దీనిని వర్తింపజేశారు. పశువులకు సోకే గాలికుంటు వ్యాధికి టీకాలు ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే, జాతీయ రక్షణ నిధి పథకంలో భారీ మార్పులు చేశారు.

Read More

May 31, 2019

కేంద్ర మంత్రులకు శాఖలు ఖరారు

దిల్లీ: నరేంద్రమోదీ కేబినెట్‌లో మంత్రులకు శాఖలు కేటాయించారు. గత మంత్రి వర్గంలో రక్షణశాఖ మంత్రిగా పనిచేసిన నిర్మలా సీతారామన్‌కు అత్యంత కీలకమైన ఆర్థికశాఖ అప్పగించారు. కొత్తగా మంత్రివర్గంలోకి చేరిన అమిత్‌ షాకు హోంశాఖ అప్పగించారు. నిన్న రాత్రి 57 మందితో కొత్త కేబినెట్‌ కొలువుదీరింది. ఇందులో 24 మందికి కేబినెట్‌, 9 మందికి స్వతంత్ర హోదా, 24 మందికి సహాయ మంత్రుల హోదా కల్పించారు. ఈ దఫా మంత్రివర్గంలో 20 మంది కొత్తవారికి అవకాశం లభించింది.

Read More

May 31, 2019

ప్రధానిగా ప్రమాణం చేశాక అధికార పత్రంపై సంతకం చేస్తున్న మోదీ

న్యూఢిల్లీ: భారత ప్రధానిగా నరేంద్ర మోదీ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్, నితిన్‌ గడ్కారీ, ఎస్‌.జయశంకర్‌ సహా మొత్తం 58 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. వీరిలో 25 మంది కేబినెట్‌ మంత్రులు కాగా.. స్వతంత్ర హోదా కలిగిన మంత్రులు 9 మంది, సహాయ మంత్రులు 24 మంది ఉన్నారు. 2014లో బీజేపీ పగ్గాలు చేపట్టి పార్టీ విస్తరణకు కృషి చేయడంతో పాటు ఇటీవలి ఎన్నికల్లో పార్టీ అఖండ విజయానికి తోడ్పడిన అమిత్‌ షా కేబినెట్‌లో చేరడం తొలినుంచీ ఊహించిందే అయినా..

Read More

May 31, 2019

మరోమారు మోదీ సర్కారు

కొత్త మంత్రివర్గం.. యువశక్తి, అనుభవజ్ఞుల సమ్మేళనం. పార్లమెంటేరియన్లుగా రాణించిన వారు, వేర్వేరు వృత్తులు, నేపథ్యాలకు చెందిన వారు ఈ బృందంలో ఉన్నారు. అందరం కలిసికట్టుగా దేశ పురోగతికి కృషి చేస్తాం

Read More

May 30, 2019

భారత్‌ను ఏకీకృతం చేసిన మోదీ

న్యూయార్క్‌: మోదీ మాదిరిగా భారత్‌ను ఏకీకృతం చేసిన ప్రధాని మరొకరు లేరని ‘టైమ్‌’ మ్యాగజైన్‌ పేర్కొంది. ఈ నెల మొదటి వారంలో దేశాన్ని విభజిస్తున్న నాయకుడని పేర్కొంటూ వ్యాసాన్ని ఇవ్వగా, ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత పూర్తి విరుద్ధమైన కథనాన్ని ప్రచురించింది. లండన్‌కు చెందిన ఇండియన్‌ ఇంక్‌ గ్రూపు మీడియా సంస్థల వ్యవస్థాపకుడు, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ మనోజ్‌ లడ్వా ఈ కథనాన్ని రాశారు. ఆయన 2014 ఎన్నికల సమయంలో మోదీ ప్రచార బృందంలో కీలకంగా వ్యవహరించారు.

Read More

May 29, 2019

మోదీతో కలిసి పనిచేయడానికి సిద్ధం: అమెరికా

వాషింగ్టన్‌: వరుసగా రెండోసారి భారీ విజయాన్ని అందుకున్న మోదీకి ప్రపంచ దేశాల నుంచి మద్దతు లభిస్తోంది. ఇప్పటికే పలు దేశాధినేతలు ఆయనకు స్వయంగా ఫోన్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు. భారత్‌తో కలిసి పనిచేయడానికి సంసిద్ధతను వ్యక్తం చేశారు. తాజాగా.. మోదీ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి అమెరికా సిద్ధంగా ఉందంటూ ట్రంప్‌ కార్యాలయ అధికారి ప్రకటించారు. అమెరికాకు భారత్‌ అత్యంత సన్నిహితదేశం అని పేర్కొన్నారు.

Read More

May 28, 2019

ప్రజలతో బంధమే గెలిచింది!

ఎన్నికలంటే కేవలం లెక్కలు మాత్రమే కాదని.. నాయకులు, ప్రజల మధ్య బంధం అని ప్రధాని మోదీ చెప్పారు. ఆ బంధం వల్లే తాజా ఎన్నికల్లో బీజేపీ అద్భుత విజయం సాధించిందన్నారు. బీజేపీ ఎప్పుడూ రాజకీయ అంటరానితనం, రాజకీయ హింస అనే ప్రమాదాలను ఎదుర్కొంటూనే ఉందని తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని వారాణసీ నియోజకవర్గం నుంచి వరసగా రెండోసారి లోక్‌సభకు ఎన్నికైన సందర్భంగా మోదీ సోమవారం వారాణసీ పర్యటనకు వచ్చారు.

Read More

May 28, 2019

ప్రతిపక్షం ఎంతో అవసరం

వారణాసి, కోల్‌కతా: రెండోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న నరేంద్ర మోదీ స్వరం మారింది. రెండో దఫా భాజపా, ఎన్డీయే ఘన విజయం అనంతరం సోమవారం తన సొంత నియోజకవర్గమైన వారణాసిలో పార్టీ అధ్యక్షుడు అమిత్‌షాతో కలిసి మోదీ పర్యటించారు. కాశీ విశ్వనాథుడికి పూజలు చేశారు. కృతజ్ఞతా సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.

Read More

May 27, 2019

అమ్మకు పాదాభివందనం

లోక్‌సభ ఎన్నికల్లో భాజపా, ఎన్డీయే పక్షాలకు ఘన విజయాన్ని అందించిన ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం తన తల్లి హీరాబెన్‌కు పాదాభివందనం చేసి ఆమె ఆశీస్సులు పొందారు. గాంధీనగర్‌కు సమీపంలోని రేసన్‌ గ్రామంలో మోదీ తమ్ముడు పంకజ్‌ వద్ద ఆమె ఉంటున్నారు. ఈనెల 30న ప్రధాన మంత్రిగా తిరిగి ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఆయన తన తల్లి వద్దకు వచ్చి ఆశీస్సులు తీసుకున్నారు.

Read More

May 27, 2019

కొత్తవారే ఎక్కువ?

మే 26(ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ఈ నెల 30న రాత్రి 7 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు మంత్రివర్గ ప్రమాణస్వీకారమూ జరుగుతుందని రాష్ట్రపతి కార్యాలయం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఐదేళ్ల పూర్తి పదవీకాలాన్ని ముగించుకుని వరుసగా రెండోసారి కూడా ప్రధాని కానున్న తొలి బీజేపీ నేతగా మోదీ రికార్డు సృష్టిస్తున్నారు.

Read More

May 24, 2019

అడ్వాణీ, జోషీలను కలిసిన మోదీ

దిల్లీ: మోదీ తనను అందరూ ఎందుకు ఇష్టపడతారో మరోసారి నిరూపించారు. ఎన్నికల సమయంలో టికెట్‌ నిరాకరించిన భాజపా సీనియర్‌ నేత మురళీ మనోహర్‌ జోషీని ఆయన ఇంటికి వెళ్లి మరీ కలిశారు. మరో భాజపా కురువృద్ధుడు ఎల్‌కే ఆడ్వాణీని కూడా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆయన వెంట భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్ షా కూడా ఉన్నారు.

Read More

May 24, 2019

సార్వత్రిక ఫలితాల్లో బీజేపీ ప్రభంజనం

ప్రధాని మోదీ కరిష్మాకు యావద్భారతం మరోసారి జై కొట్టింది. ‘సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్‌’ అన్న నరేంద్రుని నినాదానికి ఫిదా అయిపోయింది. కట్టెల పొయ్యి నుంచి విముక్తి కల్పించి సిలిండర్లు ఇవ్వడం.. మహిళల గౌరవానికి భంగం కలగకుండా మరుగుదొడ్ల నిర్మాణాన్ని ఓ యజ్ఞంగా నిర్వహించడం, విద్యుత్‌ లేని వేల గ్రామాల్లో వెలుగులు తీసుకొచ్చినా అది నరేంద్రుడి చలవేనని బలంగా నమ్మింది. ఇళ్లులేని పేదలకు ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన ద్వారా గూడు కల్పించడంతో మోదీని వాళ్లింట్లో ఒకడిగా భావించింది.

Read More

May 24, 2019

మరింత ఎక్కువ సీట్లతో.. మరింత ఎక్కువ ఓట్లతో రెండోసారి అధికారంలోకి

న్యూఢిల్లీ: దేశ ప్రథమ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ రికార్డులను ప్రధాని నరేంద్ర మోదీ తిరగరాశారు! మరింత ఎక్కువ సీట్లతో.. మరింత ఎక్కువ ఓట్ల శాతంతో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన ప్రధానిగా రికార్డు సృష్టించారు! అంతేనా.. నెహ్రూ తర్వాత ఒకే పార్టీ తరఫున ఐదేళ్లు అధికారంలో ఉండి మళ్లీ ప్రధాని పీఠాన్ని అధిరోహించనున్న రెండో వ్యక్తిగా నిలిచారు!

Read More

May 24, 2019

29 లేదా 30న మోదీ ప్రమాణం!

ఆ సామాన్యుడే.. అసామాన్యుడై.. ‘ఇంతింతై, వటుడింతై, మరియు తానింతై..’ అన్నట్టుగా ఆసేతు హిమాచలం కాషాయ ప్రభంజనానికి కారకుడయ్యాడు!! ఆ అసామాన్యుడు.. ఒకే ఒక్కడు.. నరేంద్ర దామోదర్‌ దాస్‌ మోదీ! ఐదేళ్ల క్రితం ప్రజల హృదయాలను గెలుచుకుని ప్రధాని పీఠాన్ని అధిష్ఠించిన మోదీ మ్యాజిక్‌ మరోసారి ఫలించింది! ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూసిన భారత సార్వత్రిక ఎన్నికలు-2019 ఫలితాలు విడుదలయ్యాయి! విపక్షాలు ఆశపడ్డట్టుగా..

Read More

May 24, 2019

మోదీ గెలుపు.. ఓ కొత్త చరిత్ర

యావత్‌ భారతావని ‘మన్‌ కీ బాత్‌’ (మనసులోని మాట) ఇది! ‘తక్కువేమి మనకు మోదీ ఒక్కడుండు వరకు’ అని డజనుకు పైగా రాష్ట్రాలు ఆలపించిన నమోస్తుతి- దాదాపు 300 రేకులై విచ్చుకొన్న కమల వికాసంలో ప్రతిఫలిస్తోంది. ‘అబ్‌ కీ బార్‌ 300కే పార్‌’ అంటూ మోదీ అమిత్‌ షాలు సాగించిన ప్రచార దండయాత్రతో యావత్‌ విపక్షం కకావికలమైపోయిన వాస్తవం తాజా ఫలితాల్లో ప్రతిధ్వనిస్తోంది.

Read More

May 22, 2019

నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ-సీ46

శ్రీహరికోట: ఇస్రో ఖాతాలో మరో విజయం. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి పొలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌-సీ46 వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లింది. 615 కిలోల బరువు గల రీశాట్‌-2బీఆర్‌1 ఉపగ్రహాన్ని పీఎస్‌ఎల్‌వీ-సీ46 వాహక నౌక 557 కి.మీ ఎత్తులోని కక్షలో ప్రేవేశపెట్టింది.

Read More

May 21, 2019

కేంద్ర మంత్రులకు మోదీ ధన్యవాదాలు

లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు బీజేపీలో కొత్త ఉత్సాహం నింపాయి. ఎన్డీయే పార్టీల అగ్ర నేతలకు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా మంగళవారం రాత్రి విందు ఇస్తున్నారు. మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కేంద్ర మంత్రులకు ధన్యవాదాలు తెలిపారు. ఎన్డీయే నేతల విందుకు ముందు బీజేపీ ప్రధాన కార్యాలయంలో కేంద్ర మంత్రులతో మోదీ సమావేశమయ్యారు.

Read More

May 20, 2019

గత ​​​​​ఫలితాలే పునరావృతం కానున్నాయి: జైట్లీ

ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల (ఈవీఎం) కచ్చితత్వాన్ని అనుమానిస్తున్న ప్రతిపక్ష పార్టీలు ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలను కూడా ప్రశ్నిస్తున్న విషయంపై కేంద్ర మంత్రి, భాజపా నేత అరుణ్‌ జైట్లీ విమర్శలు గుప్పించారు. ఈ విషయంపై తన బ్లాగ్‌లో అభిప్రాయాలు రాసుకొచ్చారు. ‘‘ఎగ్జిట్‌ పోల్స్‌ కచ్చితత్వాన్ని ప్రశ్నిస్తున్న వారు ఓ విషయాన్ని తెలుసుకోవాలి.

Read More

May 20, 2019

మళ్లీ.. ఎన్డీయే!

‘ఫిర్‌ ఏక్‌ బార్‌.. మోదీ సర్కార్‌’.. ఇది బీజేపీ ఎన్నికల నినాదం! దేశవ్యాప్తంగా ఓటర్లు ఈ నినాదానికి ఆకర్షితులయ్యారా!? మరోసారి మోదీ సర్కారుకు అవకాశం ఇస్తున్నారా!? మోదీ మేజిక్‌ మళ్లీ పని చేసిందా!? ప్రభుత్వ వ్యతిరేకతను తోసిరాజని ఎన్డీయే మరోసారి అధికారంలోకి రానుందా!? ఈ ప్రశ్నలన్నిటికీ ‘ఔను’ అనే అంటున్నాయి ఎగ్జిట్‌ పోల్‌ సర్వేలు! ఒక్క ‘నేత-న్యూస్‌ ఎక్స్‌’, ఏబీపీ నీల్సన్‌ మినహా మిగిలిన అన్నీ ఎన్డీయేకు మేజిక్‌ మార్కు కంటే ఎక్కువ సీట్లే కట్టబెట్టాయి.

Read More

May 20, 2019

ఎక్కువ సీట్లతో అతిపెద్ద కూటమిగా అవతరిస్తుందన్న రెండు సంస్థలు

ఎన్నికల ఫలితాలపై అంచనాలు వెల్లడయ్యాయి. ఉత్కంఠ మరింత పెరిగింది. దేశమంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాల్ని వివిధ మీడియా, సర్వే సంస్థలు ఆదివారం సాయంత్రం ప్రకటించాయి. ప్రధాని పీఠం మళ్లీ నరేంద్ర మోదీకేనని ఎగ్జిట్‌ పోల్స్‌ అభిప్రాయ పడ్డాయి. 17వ లోక్‌సభ చివరి దశ ఎన్నికలు ఆదివారం ముగిసిన వెంటనే పలు సంస్థలు ఎగ్జిట్‌ పోల్స్‌ సర్వేల ఫలితాలను వెల్లడించాయి. చాలా సర్వేలు ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టమైన మెజార్టీ సంపాదిస్తారని పేర్కొన్నాయి.

Read More

May 17, 2019

ఈసీ లేకుంటే సీఎం అయ్యేవారా?

పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల సంఘం, కేంద్ర బలగాలు తీసుకుంటున్న చర్యలను ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఖండిస్తుండడాన్ని ప్రధాని నరేంద్ర మోదీ తప్పుపట్టారు. గతంలో ఆ రెండు వ్యవస్థలూ స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించకపోయి ఉంటే ఆమె ముఖ్యమంత్రి అయ్యేవారా అని ప్రశ్నించారు. గురువారం ఆయన పశ్చిమ బెంగాల్‌లోని మథురానగర్‌, డమ్‌డమ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌లోని మవు, చందౌలి, మీర్జాపుర్‌లలో జరిగిన బహిరంగ సభల్లో ప్రసంగించారు.

Read More

May 16, 2019

బెంగాల్‌లో గూండాస్వామ్యం

టకీ/ డైమండ్‌ హార్బర్‌ (పశ్చిమ బెంగాల్‌), దేవ్‌ఘర్‌ (ఝార్ఖండ్‌), పాలీగంజ్‌ (బిహార్‌): పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ డెమోక్రసీని (ప్రజాస్వామ్యాన్ని) గూండాక్రసీ (గూండాస్వామ్యం)గా మార్చేశారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్రంగా ధ్వజమెత్తారు.

Read More

May 15, 2019

దమ్ముంటే నాకు విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపించండి నా కులం పేదరికం.. దానిపైనే పోరాటం: ప్రధాని మోదీ

మహాగట్‌బంధన్‌ పేరుతో ఏకమవుతున్న నేతలు దమ్ముంటే.. తాను ఆస్తులు పోగేసి, విదేశీ బ్యాంకుల్లో డబ్బు దాచుకున్నానని నిరూపించాలని ప్రధాని మోదీ బహిరంగ సవాల్‌ విసిరారు. సార్వత్రిక ఎన్నికల తుది దశ ప్రచారంలో భాగంగా తూర్పు ఉత్తరప్రదేశ్‌లో ఒక బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.

Read More

May 15, 2019

బంగాల్‌లో హింసాత్మక ఘటనలకు దీదీదే బాధ్యత

దిల్లీ: పశ్చిమబెంగాల్‌లో తృణమూల్‌ కార్యకర్తలు దాడులకు పాల్పడుతున్నారని భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఆరోపించారు. అమిత్‌ షా ర్యాలీ నేపథ్యంలో నిన్న బంగాల్‌లో పెద్ద ఎత్తున ఘర్షణలు జరిగిన విషయం తెలిసిందే. దీనిపై నేడు ఆయన మీడియాతో మాట్లాడారు.

Read More

May 15, 2019

నేనేమైనా అవినీతికి పాల్పడ్డానా?

బల్లియా, సాసారాం, చండీగఢ్‌: తాను అక్రమంగా సొమ్ము సంపాదించినట్టు నిరూపించాలని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ప్రతిపక్షాలకు బహిరంగ సవాలు విసిరారు. చివరి దశ పోలింగ్‌కు సమయం సమీపిస్తున్న వేళ ఆయన ఉత్తర్‌ప్రదేశ్‌లోని బల్లియా, బిహార్‌లోని సాసారాం, బక్సర్‌, చండీగఢ్‌లలో జరిగిన బహిరంగ సభల్లో ప్రసంగించారు.

Read More

May 14, 2019

ఇంటింటా వీస్తున్నవి మా పవనాలే!

ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో మోదీ పవనాలు లేవంటూ రాజకీయ పండితులు చెబుతున్నది అబద్ధమని, నిజానికి ప్రతి ఇంటి నుంచీ ఆ గాలులు వీస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సోమవారం ఆయన మధ్యప్రదేశ్‌లోని రత్లాం, హిమాచల్‌ ప్రదేశ్‌లోని సోలన్‌, పంజాబ్‌లోని భటిండాల్లో జరిగిన బహిరంగ సభల్లో ప్రసంగించారు.

Read More

May 14, 2019

నా ర్యాలీలను అడ్డుకోవచ్చు.. బీజేపీ విజయాన్ని అడ్డుకోలేరు..

‘‘జై శ్రీరాం అంటే మమతా బెనర్జీకి కోపం వస్తుంది. అలా నినదించిన వారిని ఆమె అరెస్టు చేయిస్తారు. నేను ఈ రోజు ‘జై శ్రీరాం’ అంటున్నాను. మీకు ధైర్యం ఉంటే నన్ను అరెస్టు చేయండి. రేపటి వరకు కోల్‌కతాలోనే ఉంటా’’ అని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా సవాల్‌ చేశారు.

Read More

May 13, 2019

అల్వార్‌ దుర్ఘటనపై మొసలి కన్నీరు

కుషినగర్‌, దేవ్‌రియా: రాజస్థాన్‌లోని అల్వార్‌లో దళిత మహిళపై జరిగిన సామూహిక అత్యాచార దుర్ఘటనపై బీఎస్పీ అధ్యక్షురాలు మయావతి మొసలి కన్నీరు కారుస్తున్నారని ప్రధాని మోదీ విమర్శించారు. ఆదివారం ఉత్తర్‌ప్రదేశ్‌లోని కుషినగర్‌, దేవ్‌రియా, మధ్యప్రదేశ్‌లోని ఖండ్వా, ఇండోర్‌లలో జరిగిన బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించారు.

Read More

May 9, 2019

దేశంలో 3జీల పోరు

ధన్‌బాద్‌, జంషెడ్‌పూర్‌: ప్రస్తుత సార్వత్రిక ఎన్నికలు మూడు జీ (ఆంగ్ల అక్షరం)ల మధ్య పోరాటమని భాజపా అధ్యక్షుడు అమిత్‌షా అన్నారు. కాంగ్రెస్‌లోని మూడు జీ లు సోనియా, రాహుల్‌, ప్రియాంక గాంధీలని.. భాజపాకు వచ్చేసరికి గ్రామాలు, గోమాత, గంగానది ఆ మూడు జీలని అభివర్ణించారు. ఏ మూడు కావాలో నిర్ణయించుకోవాల్సింది ప్రజలేనన్నారు.

Read More

May 9, 2019

కాంగ్రెస్‌ సహా ప్రతిపక్షం చేతులెత్తేసింది

కురుక్షేత్ర/ఫతేహాబాద్‌/న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో ఐదు దశలు పూర్తయ్యేసరికే కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు చేతులెత్తేశాయని, బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయమని తేలిపోయిందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.

Read More

May 8, 2019

రాజీవ్‌గాంధీ కుటుంబ విహారానికి ఐఎన్‌ఎస్‌ విరాట్‌ మోదీ సంచలన ఆరోపణలు

న్యూఢిల్లీ, మే 8: ఐఎన్‌ఎస్‌ విరాట్‌ యుద్ధనౌకను గాంధీ కుటుంబం ‘సొంత ట్యాక్సీ’లా వాడుకుందని ప్రధాని మోదీ ఆరోపించారు. రాజీవ్‌గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో ఆయన కుటుంబం సెలవుల్లో విహారానికి వెళ్లడానికి ఐఎన్‌ఎస్‌ విరాట్‌ను సొంత ట్యాక్సీలా ఉపయోగించుకున్నారని ధ్వజమెత్తారు.

Read More

May 8, 2019

అధికారంలోకొస్తే వాద్రా జైలుకే

ఫతేబాద్‌: ప్రజల ఆశీస్సులతో మరోసారి తమ పార్టీ అధికారం చేపట్టబోతోందంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ధీమా వ్యక్తం చేశారు. హరియాణాలోని ఫతేబాద్‌లో బుధవారం నిర్వహించిన ఎన్నికల సభలో ఆయన ప్రసంగించారు.

Read More

May 8, 2019

‘ప్రియాంకాజీ.. అదీ అహంకారమంటే’

దిల్లీ: ప్రధాని మోదీకి మహాభారతంలో దుర్యోధనుడికి ఉన్నంత అహంకారం ఉందని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా అన్న వ్యాఖ్యలపై భాజపా సీనియర్‌ నేత, కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్‌ తీవ్రంగా మండిపడ్డారు.

Read More

May 8, 2019

‘భ్రష్టాచారి’ వ్యాఖ్యలపై మోదీకి క్లీన్‌చిట్‌

దిల్లీ: మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన ‘భ్రష్టాచారి నంబర్‌ వన్‌’ వ్యాఖ్యలు ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కాదని ఈసీ స్పష్టం చేసింది. ఈ వ్యాఖ్యలపై ప్రధాని మోదీకి ఎన్నికల సంఘం క్లీన్‌చిట్‌ ఇచ్చింది.

Read More

May 8, 2019

సామాజిక మాధ్యమాల్లో మోదీ హవా

దిల్లీ: ఫేస్‌బుక్‌, ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో ప్రపంచం మొత్తం మీద అత్యధిక ప్రజాదరణ, అనుసరణ కలిగిన రాజకీయ నాయకుల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ద్వితీయస్థానంలో ఉన్నట్లు ఓ తాజా నివేదిక వెల్లడించింది.

Read More

May 3, 2019

మోదీ ‘అణ్వస్త్ర’ వ్యాఖ్యలపై ఈసీ క్లీన్‌చిట్‌

దిల్లీ: ప్రధాని మోదీకి ఎన్నికల సంఘం (ఈసీ) మరోసారి క్లీన్‌చిట్‌ ఇచ్చింది. ఏప్రిల్‌ 21న ఆయన రాజస్థాన్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ సైనిక దళాల అంశాన్ని ప్రస్తావనకు తెచ్చారని, భారత అణ్వస్త్ర మీట దీపావళి కోసం కాదంటూ వ్యాఖ్యానించారని కాంగ్రెస్‌ ఫిర్యాదు చేసింది.

Read More

May 2, 2019

మేక్ ఇన్ ఇండియాలో మరో ఘనత

అమెరికాకు చెందిన విమాన తయారీ సంస్థ బోయింగ్ భారత్ లో యుద్ధ విమానాల తయారీ కేంద్రాన్ని నెలకొల్పేందుకు ముందుకొచ్చింది.

Read More

May 1, 2019

నేరస్థులను వదిలే ప్రసక్తేలేదు: ప్రధాని మోదీ

మహారాష్ట్రలోని గడ్చిరోలిలో భద్రత సిబ్బందిపై మావోయిస్టుల దాడిని తీవ్రంగా ఖండించిన ప్రధాని మోదీ నేరస్థులను వదలబోమని స్పష్టం చేశారు.

Read More

May 1, 2019

రూ. 1,13,865 కోట్లకు చేరిన జీఎస్టీ వసూళ్లు

దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న ఒకే పన్ను విధానం ప్రభుత్వానికి భారీగా ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి జీఎస్టీ వసూళ్లు రూ. 1,13,865 కోట్లకు చేరాయి.

Read More

May 1, 2019

రూ. 12,000 కోట్ల రాయితీ

క్రెడిట్ అనుసంధానిత రాయితీ పథకం ద్వారా గృహ కొనుగోలుదారులకు మార్చి నాటికి రూ. 12,000 కోట్ల రాయితీ లభించింది.

Read More


April 8, 2019

కమలం గుర్తుకే మన ఓటు

మా తాతగారు మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ కీ.శే. శ్రీ దేవినేని నారాయణ స్వామిగారి స్ఫూర్తితో రాజకీయాల్లోకి ప్రవేశించాను. శ్రీ నరేంద్రమోదీగారి నాయకత్వంపై ఉన్న విశ్వాసంతో భారతీయ జనతా పార్టీలో చేరాను. అనంతపూర్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మీ ఇంటి ఆడబిడ్డగా నన్ను ఆదరించండి. ఆశీర్వదించండి.

Read More

Mar 20, 2019

వ్యవస్థలను గౌరవించడం, వ్యవస్థలను ధిక్కరించడం రెండు పరస్పర విరుద్ధమైన అంశాలు.

పత్రికా స్వేచ్ఛ నుంచి పార్లమెంటు వరకు, సైనికుల నుంచి భావ ప్రకటన స్వేచ్ఛ వరకు, రాజ్యాంగం నుంచి న్యాయస్థానాలవరకు వ్యవస్థలను అవమానించడమే కాంగ్రెస్‌ తీరు. కాంగ్రెస్‌ తప్ప మిగిలిన వారందరివీ అసత్యాలే. ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించండి -ఓ కుటుంబం అధికార కాంక్ష దేశంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో.

Read More

Mar 5, 2019

స్వచ్ఛ భారత్‌ సంకల్ప సాధనలో మరో ఘనత

అరుదైన ఘనత సాధించిన ప్రపంచంలోనే అతిపెద్ద పారిశుధ్య పథకం. స్వచ్ఛ భారత్‌ కార్యక్రమంలో భాగంగా నిర్మించిన మరుగు దొడ్లలో 96 శాతానికిపైగా ఉపయోగంలో ఉన్నాయని స్వతంత్ర నిర్ధారణ సంస్థ ప్రకటించింది.

Read More

Feb 26, 2019

జైషే ఉగ్ర సంస్థ లక్ష్యంగా మెరుపు దాడి

సజైషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థ మరోసారి భారత్‌లోని వివిధ ప్రాంతాల్లో ఆత్మాహుతి దాడులకు సిద్ధమవుతోందనే విశ్వసనీయ నిఘా వర్గాల సమాచారం మేరకు ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దళం మెరుపు దాడులు జరిపింది.

Read More

Feb 24, 2019

సొంతింటి కొనుగోలుదారులకు శుభవార్త

స్థిరాస్తి రంగం మరియు మధ్యతరగతి వారికి భారీ ఊరట. ప్రధాని శ్రీ నరేంద్రమోదీ గారి నాయకత్వంలో అందుబాటు ధరల్లో లభించే ఇళ్ల కొనుగోలుపై జీఎస్టీ రేటును 8 శాతం నుంచి ఒక శాతానికి తగ్గింపు. నిర్మాణంలో ఉన్న ఇళ్లపై 12శాతం నుంచి 5 శాతానికి తగ్గింపు. వీటికి ఎలాంటి ఇన్ పుట్ ట్యాక్స్ క్రెడిట్ కూడా వర్తించదు.

Read More

Feb 19, 2019

జాతీయ ఎలక్ట్రానిక్ పాలసీతో కోటిమందికి ఉపాధి

జాతీయ ఎలక్ట్రానిక్ పాలసీ – 2019 ని ఆమోదించిన కేంద్ర ప్రభుత్వం. 2025 నాటికి 400 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువను సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. తద్వారా ఈ రంగంలో కోటిమందికిపైగా ఉపాధి లభించనుంది.

Read More

Feb 19, 2019

3 శాతం పెరిగిన ఉద్యోగుల డీఏ

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ 3 శాతం పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జనవరి 1, 2019 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని ప్రకటించింది. ఈ నిర్ణయంతో 1.1 కోట్ల మంది ఉద్యోగులు, పింఛనుదారులకు లబ్ధి చేకూరనుంది.

Read More

Feb 19, 2019

జన్ ధన్ ఖాతాల్లో భారీగా పెరిగిన సగటు నిల్వలు

ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పథకం కింద తెరచిన బ్యాంకు ఖాతాల్లో రికార్డు స్థాయిలో 24 శాతం పెరిగిన సగటు నిల్వల మొత్తం. ఎస్.బి.ఐ. ఖాతాదారుల్లో ఈ సరాసరి మొత్తం రూ.1,988కు చేరింది.

Read More

Feb 13, 2019

ఇచ్చిన మాట నెరవేర్చే పార్టీ బీజేపీ

రైతులకు పెట్టుబడి సాయం చేస్తామని కాంగ్రెస్ పార్టీ 2004, 2009 ఎన్నికల మానిఫెస్టోలో చేసిన వాగ్దానాలు నెరవేర్చడంలో విఫలమైంది. నరేంద్రమోదీ ప్రభుత్వం మాత్రం పీఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు అండగా నిలిచింది.

Read More

Feb 12, 2019

ఆయుష్మాన్ పథకం ద్వారా 11లక్షల మందికి వైద్యం

కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ పథకం లక్షలాది మంది పేదలకు వరంగా మారింది. ఫిబ్రవరి 6, 2019 నాటికి దేశ వ్యాప్తంగా 10, 94, 254 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందారు.

Read More

Feb 11, 2019

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు అమిత్‌ షా బహిరంగలేఖ

భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడు అమిత్‌షా ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రానికి కేంద్రం చేసిన సహాయం విషయంలో చంద్రబాబు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. ఓటమి భయంతోనే నిరాధార ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు.

Read More

Feb 11, 2019

ఐదేళ్లలో 40రెట్లు పెరిగిన మొబైల్‌ వాలెట్‌ చెల్లింపులు

మొబైల్ వాలెట్ చెల్లింపుల్లో భారతదేశం అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడుతోంది. డిజిటల్ ఆర్థిక రంగంలో ప్రపంచ సగటుతో పోల్చితే 1.5 రెట్లు వేగంగా భారత్‌ అభివృద్ధి చెందుతోంది. ఐదేళ్లలో మొబైల్‌ వాలెట్‌ చెల్లింపులు 40 రెట్లు పెరిగాయి.

Read More

Jan 22, 2019

రూ. లక్షకోట్లతో ఏపీలో రహదారులు

ఆంధ్రప్రదేశ్ లో రహదారుల అభివృద్ధి కోసం లక్షకోట్ల రూపాయలు ఖర్చుచేయనున్నామని కేంద్ర ఉపరితల రవాణా మరియు జాతీయ రహదారుల శాఖా మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు.

Read More

Jan 06, 2019

చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెబుతారు

వారసత్వ రాజకీయాలను ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంగీకరించబోరని ప్రధాని శ్రీ నరేంద్రమోదీ గారు వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడికి బుద్ధి చెబుతారని విశ్వాసం వ్యక్తం చేశారు.

Read More

Mar 14, 2018

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి రూ. 12,476కోట్లు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.12, 476 కోట్ల ఆర్థిక సహాయాన్ని మంజూరు చేసిన కేంద్రప్రభుత్వం. రాజ్యసభలో వివరణ ఇచ్చిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్స్ రాజ్ గంగారాం ఆహిర్.

Read More