మెంబర్షిప్ పొందండి

నా గురించి

శ్రీమతి హంస దేవినేని భారతీయ జనతాపార్టీ ఆంధ్రప్రదేశ్‌ అధికార ప్రతినిధి, కార్యనిర్వాహక సభ్యురాలు. మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయివరకు యువమోర్చా, మహిళా మోర్చా మరియు అనేక పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని నాయకత్వం వహించారు.

Read More

కుటుంబ నేపథ్యం

స్వగ్రామం- రాకెట్ల, ఉరవకొండ మండలం, అనంతపూర్‌ జిల్లా, ఆంధ్రప్రదేశ్‌. తాతయ్య దేవినేని నారాయణస్వామి స్వాతంత్ర్య సమరయోధుడు, జిల్లా న్యాయమూర్తి; 1977 & 1980 లో జనతా పార్టీ తరపున అనంతపూర్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎన్నికల్లో పోటీచేశారు; తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యులు; 1983- 1985 వరకు అనంతపూర్‌ ఎమ్మెల్యేగా పనిచేశారు; 1985-1990 వరకు తెలుగుదేశం పార్టీ తరపున లోక్‌సభ ఎంపీగా పనిచేశారు.

విద్యార్హతలు

ఎల్ఎల్.ఎమ్, తులేన్ యూనివర్సిటీ లా స్కూల్, యూ.ఎస్.ఏ. పి.జి. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ లాస్, నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా బి.ఏ, ఎల్ఎల్.బి

సామాజిక సేవ

బ్లూ క్రాస్‌, మేక్‌ ఎ విష్‌ సంస్థలతో కలిసి పనిచేశారు. ప్రస్తుతం బ్రహ్మకుమారీస్‌ ఆధ్యాత్మక సంస్థతో కలిసి పనిచేస్తున్నారు.

నేను సైతం

పార్టీ బలోపేతానికి కృషి

ప్రజల ఆలోచన విధానం, అభిప్రాయాల్లో మార్పు తీసుకొస్తూ ఆంధ్రప్రదేశ్‌లో భారతీయ జనతాపార్టీని బలోపేతం చేసేందుకు కృషిచేస్తున్నారు. న్యాయ పరంగా, మేథోపరమైన అంశాల్లో పార్టీ/ప్రభుత్వానికి తనవంతు సహకారం అందిస్తున్నారు.

గుణాత్మక మార్పే లక్ష్యం

యువ మహిళ, విద్యావంతురాలు, మేథావి, న్యాయవాదిగా మరియు సంప్రదాయ ప్రమాణాలు, విలువలు పాటిస్తూ ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పు తీసుకురావడమే తన ఆకాంక్ష. మహిళా సాధికారత, మహిళల రక్షణ, యువత, న్యాయపరమైన అంశాలపై ఆసక్తి.

ఏపీ ప్రభుత్వ అక్రమాలపై గళం

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ అధికారుల అక్రమాలు, అవకతవకలు మరియు ప్రభుత్వ నిర్లక్ష్యాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పార్టీ ప్రతినిధుల బృందంతో కలిసి వెళ్లి ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు.

న్యాయ సహకారం

కక్షిదారులకు సమర్థమైన న్యాయ సేవలు అందిస్తూనే ఆర్థికంగా బలహీన వర్గాలు మరియు నిరక్షరాస్యులకు ఉచితంగా న్యాయ సలహాలు, సహకారాన్ని అందిస్తున్నారు.